డ్రైవింగ్ లైసెన్స్ ఇక కఠినం.. కొత్తగా ఆన్‌లైన్ టెస్ట్ తప్పనిసరి
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో రాష్ట్ర రవాణా శాఖ కీలక మార్పులు తీసుకువస్తోంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో ఇకపై లైసెన్స్ పొందాలంటే కొత్తగా ఓ ఆన్‌లైన్ పరీక్షను తప్పనిసరి చేయనుంది. ఇప్పటికే ఉన్న లెర్నర్ లైసెన్స్ (LLR), డ్రైవింగ్ టెస్ట్‌లకు అదనంగా ఈ 'రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్' పరీక్షను తీసుకువస్తున్నారు. ఈ కొత్త విధానం ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలులోకి రానుంది.
కొత్త నిబంధన ప్రకారం ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు మూడు గంటల పాటు ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతా పాఠాలు వినాలి. డ్రైవింగ్‌లో చేసే చిన్న పొరపాట్లు ఎలా ప్రాణాంతకంగా మారతాయో వీడియోల రూపంలో వివరిస్తారు. కెమెరా ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఇంట్లో నుంచే ఈ పరీక్ష రాయవచ్చు. ఇందులో ఉత్తీర్ణులై సర్టిఫికేట్ నంబర్ పొందాకే LLR స్లాట్ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది.
దేశవ్యాప్తంగా ఏటా 1.7 లక్షల మంది, తెలంగాణలో సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మరణాల సంఖ్యను తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తోంది. లైసెన్స్ పొందడం కొంత కఠినంగా మారినా, ఈ విధానం రోడ్డు ప్రమాదాల నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.