ఏపీ మద్యం కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు భారీ ఊరటను కల్పించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ లో ఉన్న ఆయనను ఇప్పటికే సిట్ మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ విచారణలో ఆయన పలు విషయాలను వెల్లడించినట్టు సమాచారం. 


ఈ కేసులో ముప్పిడి అవినాశ్ రెడ్డి నగదు బదిలీలు, ఆర్థిక నియంత్రణలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అవినాశ్ రెడ్డి జైలు నుంచి బయటకు రానున్నారు. మరోవైపు, మద్యం విక్రయాల్లో జరిగిన అక్రమాలు, సిండికేట్ల ఏర్పాటు వెనుక ఉన్న అసలు శక్తులను బయటకు తీసేందుకు సిట్ తన విచారణను మరింత వేగవంతం చేసింది.


More Telugu News