రంజాన్ సెలవు 21వ తేదికి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్‌లో రంజాన్ పండుగ సెలవు తేదీలో ప్రభుత్వం మార్పు చేసింది. ముందుగా ప్రకటించినట్లు శుక్రవారం (మార్చి 20) కాకుండా, శనివారం (మార్చి 21)న రంజాన్ సెలవుగా నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న జీవో ఆర్టి నెం: 612 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.

గురువారం నెలవంక కనిపించని నేపథ్యంలో, పండుగను శనివారం జరుపుకోనున్నట్లు ఏపీ వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి తెలియజేసింది. వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ మార్పు చేసినట్లు సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్-1881 కింద నమోదైన షాపులు, ఇతర సంస్థలకు కూడా వర్తిస్తుందని మరో జీవోలో తెలిపారు.
 


More Telugu News