NTR: ఎన్టీఆర్ 'ఆరాధన'కి దర్శకుడిగా కె.విశ్వనాథ్ చేయవలసిందట!

Aradhana Movie Special
షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ - వాణిశ్రీ నాయకా నాయికలుగా నటించిన 'ఆరాధన', 1976లో మార్చి 12వ తేదీన విడుదలైంది. బీవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అట్లూరి పుండరీ కాక్షయ్య నిర్మించారు. ఈ నెల 12వ తేదీతో ఈ సినిమా 50 ఏళ్లను పూర్తిచేసుకుంది.ఈ సందర్భంగా పుండరీకాక్షయ్య తనయుడు నాగేశ్వరావు, ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

హిందీలో 'గీత్' సినిమాను తెలుగులో చేయడానికి రైట్స్ తీసుకున్నాము. రైట్స్ ఇచ్చేవారు కూడా, ఎన్టీఆర్ కి గల ఇమేజ్ వేరు .. ఈ కాన్సెప్ట్ వేరు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్కువగా విమర్శలే వినిపించాయి. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఆయనను మూగవాడిగా చూస్తారా? అనే ఒక టాక్ వినిపించింది. నాన్నగారు ఈ సినిమాకి కె విశ్వనాథ్ గారిని దర్శకుడిగా అనుకున్నారు. ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు" అని అన్నారు. 

'గీత్' సినిమాను చూసిన విశ్వనాథ్ గారు, మన నేటివిటీకి తగినట్టుగా ఈ కథను మార్చాలని అన్నారు. అందుకు నాన్నగారు ఒప్పుకోలేదు. హిందీలో ఎలాగైతే ఉందో అలాగే ఉండాలని అన్నారు. అయితే తాము మరో ప్రాజెక్టును కలిసి చేద్దామని విశ్వనాథ్ గారు తప్పుకున్నారు. అప్పుడు ఆల్రెడీ మాకు పరిచయమున్న బీవీ ప్రసాద్ గారి దగ్గరికి ఈ ప్రాజెక్టు వెళ్లింది. 'కులుమనాలి'లో వాతావరణం అనుకూలించకపోయినా, ఎన్టీఆర్ గారి సహకారంతో ఆ సినిమాను పూర్తి చేయగలిగాము" అని అన్నారు. 

Go Back to Shorts
NTR
NTR Aradhana Movie
KVishwanath
Vani Sri
Telugu cinema
BV Prasad director
Aturi Pundarikakshaiah
Geet Hindi movie
Telugu movie news
Aradhana 50 years

More Telugu News