నా అనుమతి లేకుండానే ఆ పని చేశారు.. వివాదాస్పద పాటపై నోరా ఫతేహి క్లారిటీ
బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి... 'కేడీ: ది డెవిల్' సినిమాలోని 'సర్కే చునార్ తేరీ సర్కే' పాటపై చెలరేగిన వివాదంపై ఎట్టకేలకు స్పందించారు. ఈ పాట హిందీ వెర్షన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, దాని నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఓ వీడియో సందేశం ద్వారా స్పష్టం చేశారు. ఈ పాటను తన అనుమతి లేకుండానే హిందీలో డబ్ చేసి విడుదల చేశారని ఆమె ఆరోపించారు.
ఈ పాటను తాను మూడేళ్ల క్రితం కన్నడలో షూట్ చేశానని, దానిని తర్వాత ఎలా మారుస్తారో తనకు తెలియదని నోరా తెలిపారు. "ఇది ఒక పెద్ద సినిమా కావడం, సంజయ్ దత్ లాంటి స్టార్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌కు ఒప్పుకున్నాను. వాస్తవానికి ఇది 'నాయక్ నహీ ఖల్నాయక్ హూ మెయిన్' పాటకు రీమేక్ అనుకున్నాను" అని ఆమె వివరించారు. కన్నడలో సాహిత్యం తనకు అర్థం కాకపోవడంతో వారు చెప్పిందే నమ్మానని, అందులో అసభ్యత ఏమీ అనిపించలేదని అన్నారు.
అయితే, హిందీలో డబ్ చేసి విడుదల చేయడానికి తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, ఈ విషయం తన దృష్టికే రాలేదని ఆమె ఆరోపించారు. పాట లాంచ్ ఈవెంట్‌లో కూడా తనకు ఇబ్బందికరమైన అనుభవాలు ఎదురయ్యాయని నోరా వెల్లడించారు. లిరికల్ వీడియోలో బాగాలేని ఫొటోలు, తనతో పాటు సంజయ్ దత్‌కు సంబంధించిన ఏఐ ఫొటోను వాడటం చూసి చాలా చిరాకు పడ్డానని, అయినా నిగ్రహం పాటించానని చెప్పారు.
హిందీ వెర్షన్ చూసిన తర్వాత ఇది కచ్చితంగా విమర్శల పాలవుతుందని ముందే ఊహించి, ఈ విషయం దర్శకుడికి చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విమర్శల కారణంగానే మేకర్స్ పాటను తొలగించారని, అందుకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. "ఇలాంటి కంటెంట్ సృష్టించే దర్శక, నిర్మాతలు బాధ్యత వహించాలి. ఇకపై నేను మరింత జాగ్రత్తగా ఉంటాను" అని నోరా పేర్కొన్నారు.