నెతన్యాహు వీడియో 'డీప్‌ఫేక్'?: ఏఐ బాట్ సంచలన విశ్లేషణ.. ముదురుతున్న మిస్టరీ!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు క్షేమంగా ఉన్నారా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆయన మరణించారంటూ వస్తున్న పుకార్లను తిప్పికొట్టేందుకు నెతన్యాహు ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. జెరూసలేం కొండల్లోని 'ది సతాఫ్' అనే కేఫ్‌లో ఆయన కాఫీ తాగుతూ కనిపించారు. తన మృతి వార్తలపై జోక్ చేస్తూ.. "నేను చనిపోలేదు.. కాఫీ కోసం పడిచస్తున్నా (I am dying for coffee)" అంటూ చమత్కరించారు. గతంలో ఆయనకు ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించిన వీడియోపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఈ వీడియోలో తన రెండు చేతులను కెమెరాకు చూపిస్తూ వేళ్లను లెక్కపెట్టుకోమన్నారు.
బాంబు పేల్చిన గ్రోక్
ఈ వీడియో విడుదలైన కొద్దిసేపటికే 'ఎక్స్' ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' దీనిపై సంచలన విశ్లేషణ ఇచ్చింది. ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "ఇది 100 శాతం అడ్వాన్స్‌డ్ ఏఐ డీప్‌ఫేక్" అని తేల్చి చెప్పింది. పబ్లిక్ కేఫ్‌లో కూర్చుని రహస్య ఆపరేషన్ల గురించి మాట్లాడటం అసాధ్యమని, ఈ వీడియోలో లిప్-సింక్ సరిగ్గా లేదని, కాఫీ కప్పులో ద్రవం కదలడం లేదని గ్రోక్ పేర్కొంది. నెటిజన్లు కూడా నెతన్యాహు ముఖం కిందికి వంగినప్పుడు ఆకారం మారడాన్ని గమనించి ఇది 'ఏఐ' మాయాజాలమని వాదిస్తున్నారు.
కేఫ్ యజమానుల క్లారిటీ
ఈ వివాదం తీవ్రమవ్వడంతో 'ది సతాఫ్' కేఫ్ యాజమాన్యం రంగంలోకి దిగింది. నెతన్యాహు తమ కేఫ్‌కు వచ్చిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "ప్రధాని మా వద్దకు రావడం సంతోషంగా ఉంది" అని పోస్ట్ చేశారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం (PMO) కూడా ఇవన్నీ 'ఫేక్ న్యూస్' అని, నెతన్యాహు ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయినప్పటికీ, సోమవారం నెతన్యాహు మరో కొత్త వీడియోను విడుదల చేసి తాను క్షేమంగా ఉన్నానని ప్రజలకు వివరించాల్సి వచ్చింది.