హైదరాబాద్‌లో వర్షం.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం

  • ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
  • మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
  • నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం సాయంత్రం భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడటంతో ఉద్యోగులు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు.

మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో పలుచోట్ల రోడ్లపై నీరు మోకాళ్ల లోతుకు వచ్చింది. నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీటిని తొలగించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి.

Hyderabad Rain
Telangana Weather
Hyderabad Weather
Heavy Rain Hyderabad
Hyderabad Flooding

More Telugu News