ఎప్ స్టీన్ ఫైల్స్‌తో లింక్.. రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన కేంద్రమంత్రి కూతురు
సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ ఫైల్స్‌లో తన ప్రస్తావన కూడా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుండటంతో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కుమార్తె రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, తనపై ఆన్‌లైన్ సోషల్ ప్లాట్‌ఫామ్‌ల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై పరువు నష్టం దావా వేశానని ఆమె వెల్లడించారు. ఎప్ స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
గత నెల 22వ తేదీ నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆయా సోషల్ మీడియా ఖాతాలపై శాశ్వత నిషేధం విధించాలని ఆమె కోరారు. తనపై నిరాధార ఆరోపణలతో ఉన్న కంటెంట్‌ను తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా, పరువు నష్టం దావా కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.