మోదీ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్

  • మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన రెండ్రోజుల తర్వాత ఇరాన్‌పై దాడి
  • ఈ దాడులకు భారత్ మద్దతిస్తున్నట్టుగా విపక్షాల విమర్శలు
  • మోదీ పర్యటనకు ముందు నుంచే పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయన్న రువెన్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ పర్యటనపై వస్తున్న విమర్శలకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ స్పష్టతనిచ్చారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు, ఆ వెంటనే ఇరాన్‌పై జరిగిన దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.


ప్రధాని మోదీ ఫిబ్రవరి 25-26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 28న) ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఈ క్రమాన్ని ఉటంకిస్తూ, పశ్చిమాసియా ఉద్రిక్తతలకు భారత్ మద్దతు ఇస్తోందన్నట్లుగా విపక్షాలు చేస్తున్న విమర్శలను ఇజ్రాయెల్ రాయబారి తోసిపుచ్చారు. ఆ ప్రాంతంలో పరిస్థితులు మోదీ పర్యటనకు ముందు నుంచే అస్థిరంగా ఉన్నాయని, ఆపరేషన్ చేపట్టేందుకు తమకు అవకాశం వచ్చినప్పుడే దాడులు చేశామని ఆయన వివరించారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తిగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఉద్దేశించినదని, దీనిని సైనిక చర్యలతో ముడిపెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.


Ruven Azar
Israel
Iran
Narendra Modi
India
Israel-Iran conflict
West Asia tensions
India Israel relations
Modi Israel visit
US Iran relations

More Telugu News