'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీరిలీజ్ ఈవెంట్ కు రాని తమన్, దేవిశ్రీ ప్రసాద్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. అయితే, ఈ వేడుకలో సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్ కనిపించకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రాక్ స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు పాటలు అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తమన్‌కు అప్పగించింది. ఈ క్రమంలో, నేపథ్య సంగీతం మరొకరు చేయడం పట్ల దేవిశ్రీ కొంత అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయన ఈవెంట్‌కు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు, తాను మ్యూజిక్ డైరెక్ట్ చేయని సినిమా వేడుకకు రావడం ఎందుకనే ఉద్దేశంతో తమన్ కూడా దూరంగా ఉన్నట్లు సమాచారం.
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఈ నెల 19న ఉగాది పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు.