బ్యాడ్మింటన్ స్కోరింగ్ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం చేసిన సైనా నెహ్వాల్

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రతిపాదిస్తున్న స్కోరింగ్ మార్పులపై తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 21 పాయింట్ల (3x21) విధానాన్ని మార్చి, దాని స్థానంలో 15 పాయింట్ల (3x15) విధానాన్ని తీసుకురావాలనే ఆలోచనను ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. పాత విధానమే (21 పాయింట్లు) క్రీడాకారుల ఓర్పును, ఆట అసలైన నైపుణ్యాన్ని పరీక్షిస్తుందని ఆమె అభిప్రాయపడింది.


డెన్మార్క్‌లోని హొర్సెన్స్‌లో ఏప్రిల్ 25న జరగనున్న బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ 15 పాయింట్ల విధానంపై ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, ఇంటర్నేషనల్ మూమెంట్ టు యునైటెడ్ నేషన్స్ సలహాదారుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సైనా, ఆట స్ఫూర్తిని కాపాడాలని పిలుపునిచ్చింది. 15 పాయింట్ల విధానం వల్ల ర్యాలీలు తగ్గిపోయి, ఆట నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని, ఇది కేవలం అదృష్టంపై ఆధారపడేలా మారుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి, అధికారులు వాణిజ్య పరమైన కోణంలో కాకుండా... క్రీడాకారుల సంక్షేమం, ఆట సాంప్రదాయం వైపు నుంచి ఆలోచించాలని కోరింది.



More Telugu News