'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రైతులకు నిధులను విడుదల చేశారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాను కూడా రైతు బిడ్డనేనని, రైతుల కష్టాలు తనకు బాగా తెలుసని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏటా రూ.20,000 అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 భరిస్తోందని వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గత 20 నెలలుగా అనేక సమస్యలను అధిగమిస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణ పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని గుర్తుచేశారు.
రాష్ట్రంలో జలవనరుల యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎం పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదితో అనుసంధానం చేసి సాగునీటి సమస్యలను అధిగమించామన్నారు. చెరువుల్లో పూడిక తీసి నీటితో నింపడం వల్ల ఖరీఫ్, రబీ పంటల తర్వాత కూడా జలకళ ఉందన్నారు. దీని ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వివరించారు. కాలువల్లో పూడికతీత, డ్రెయిన్ల ఆధునికీకరణకు ఆదేశాలు జారీ చేశామని, చివరి ఆయకట్టు భూములకు కూడా నీరు అందించే బాధ్యతను సాగునీటి సంఘాలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు తీసుకువస్తున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేపడుతున్నామని తెలిపారు. ఆక్వా రైతులకు రూ.810 కోట్ల రాయితీ అందించామని, రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని చెప్పారు. డిమాండ్ ఆధారిత పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి గన్నవరం విమానాశ్రయం నుంచి ఎగుమతులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలవరం పూర్తయితే కృష్ణా డెల్టా ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని, రాష్ట్రంలో సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరతాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.