టీ20 ప్రపంచ కప్... భారత్ సహా ఏ జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందంటే?

  • టైటిల్ సాధించిన టీమిండియాకు రూ.24.25 కోట్లు
  • రన్నరప్ న్యూజిలాండ్‌కు రూ.13.08 కోట్లు
  • సూపర్ 8లో నిష్క్రమించిన పాకిస్థాన్‌కు రూ.4.80 కోట్లు
టీ20 ప్రపంచకప్ విజేతగా టీమిండియా వరుసగా రెండో నిలిచింది. 2007లో టైటిల్ సాధించిన భారత జట్టు 2024, 2026లో కూడా గెలుచుకుని మొత్తంగా మూడుసార్లు కప్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో టైటిల్ సాధించిన టీమిండియాతో పాటు ఏ జట్టుకు ఎంత ప్రైజ్ మనీ అందుతుందో తెలుసా? ఐసీసీ టోర్నీ ప్రైజ్ మనీ రూ.103 కోట్లకు సంబంధించిన పంపిణీ వివరాలను వెల్లడించింది.

విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.24.25 కోట్లు, రన్నరప్ న్యూజిలాండ్‌కు రూ.13.08 కోట్లు దక్కాయి. సెమీ ఫైనల్ వరకు వచ్చిన దక్షిణాఫ్రికాకు రూ.9.24 కోట్లు, ఇంగ్లండ్‌కు రూ.8.96 కోట్లు అందాయి.

సూపర్ 8లో నిష్క్రమించిన వెస్టిండీస్‌కు రూ.4.95 కోట్లు, పాకిస్థాన్‌కు రూ.4.80 కోట్లు, జింబాబ్వేకు రూ.4.52 కోట్లు, శ్రీలంకకు రూ.4.39 కోట్లు అందాయి.

లీగ్ స్టేజిలో నిష్క్రమించిన ఆప్ఘనిస్థాన్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా జట్లకు ఒక్కోదానికి రూ..2.85 కోట్ల చొప్పున అందాయి. స్కాట్లాండ్‌కు రూ.2.56 కోట్లు, ఐర్లాండ్‌కు రూ.2.50 కోట్లు వచ్చాయి. ఇటలీ, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్ జట్లకు ఒక్కో దానికి రూ.2.35 కోట్లు, కెనడా, నమీబియా, ఒమన్ జట్లకు ఒక్కో దానికి రూ.2.06 కోట్ల చొప్పున పంపిణీ చేసినట్లు ఐసీసీ తెలిపింది. ఇదిలా ఉండగా, భారత జట్టుకు బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది.


More Telugu News