అంతరిక్షం నుంచి చైనా నిఘా: అమెరికా యుద్ధ వ్యూహాలను పసిగడుతున్న 'మిజార్‌విజన్'
- అమెరికా యుద్ధనౌకలు, విమానాల కదలికలపై చైనా డేగకన్ను
- రియల్ టైమ్ డేటాతో అమెరికా ఆయుధ సంపత్తి బహిర్గతం
- 'మిజార్‌విజన్' విడుదల చేస్తున్న హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు
- యుద్ధం మొదలవ్వకముందే వ్యూహాలను పసిగట్టిన చైనా ఏఐ సంస్థ
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని చైనా అంతరిక్షం నుంచి నిశితంగా గమనిస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో అమెరికా మోహరించిన భారీ యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ నౌకల కదలికలను చైనాకు చెందిన 'మిజార్‌విజన్' (MizarVision) అనే జియోస్పేషియల్ నిఘా సంస్థ ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తోంది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించక ముందే ఫిబ్రవరి చివరి వారంలోనే అమెరికా ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలను మోహరించిందో మిజార్‌విజన్ శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపెట్టింది. జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాల్లో ఉన్న F-22 స్టెల్త్ ఫైటర్లు, F-35 విమానాలు మరియు థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థల ఫోటోలను ఈ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.
మిజార్‌విజన్ స్వయంగా ఉపగ్రహాలను కలిగి లేనప్పటికీ, చైనాకు చెందిన 'జిలిన్-1' వంటి శక్తివంతమైన శాటిలైట్ నెట్‌వర్క్, ఏఐ టూల్స్ సాయంతో ఈ డేటాను విశ్లేషిస్తోంది. కేవలం విమానాలే కాకుండా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు 'యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్', 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' ఎటువైపు ప్రయాణిస్తున్నాయనే విషయాన్ని కూడా రియల్ టైమ్‌లో ట్రాక్ చేస్తోంది.
సాధారణంగా అత్యంత రహస్యంగా ఉంచే సైనిక మోహరింపుల వివరాలను, ఒక ప్రైవేట్ సంస్థ ఇలా బహిరంగంగా విడుదల చేయడం అమెరికా రక్షణ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా, యుద్ధ క్షేత్రంలో అమెరికా పైచేయి సాధించకుండా ఇరాన్‌కు పరోక్షంగా సహకరించే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిఘా చిత్రాల వల్ల అమెరికా వ్యూహాలు దెబ్బతినే అవకాశం ఉందని పెంటాగన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.