అహ్మదాబాద్ స్టేడియంలో నారా లోకేశ్ సందడి... విజువల్స్ ఇవిగో!
- అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్
- భారత్ న్యూజిలాండ్ పోరును ప్రత్యక్షంగా వీక్షించిన లోకేశ్
- స్టేడియంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో ముచ్చట
- ఆర్సెలార్ మిట్టల్ ఎండీ ఆదిత్య మిట్టల్‌ను కలిసిన మంత్రి
- అనకాపల్లి ప్లాంట్ గ్రౌండ్ బ్రేకింగ్‌పై లోకేశ్ ట్వీట్
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ తుది పోరును ఆయన స్టేడియంలో కూర్చుని ప్రత్యక్షంగా తిలకించారు. ప్రత్యేకంగా టీమిండియా జెర్సీని ధరించి స్టాండ్స్‌లో కనిపించిన లోకేశ్.. భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ సందడి చేశారు.
ఈ సందర్భంగా స్టేడియంలో పలువురు ప్రముఖులను లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య మిట్టల్‌తో కూడా లోకేశ్ భేటీ అయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే వీరితో కాసేపు ముచ్చటించారు. అంతేకాదు, టీమిండియా దిగ్గజాలు ధోనీ, రోహిత్ శర్మ, వెంకటేశ్ ప్రసాద్ లో పాటు ఐసీసీ చైర్మన్ జై షాను కూడా లోకేశ్ ఈ సందర్భంగా కలిశారు.
దీనికి సంబంధించిన ఫొటోలను మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆదిత్య మిట్టల్‌తో భేటీ సందర్భంగా ఏపీ పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, త్వరలోనే అనకాపల్లిలో ఏఎంఎన్ఎస్ ప్లాంట్ భూమిపూజ కార్యక్రమం జరగనుందని, ఆ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు లోకేశ్ తన ట్వీట్‌లో వెల్లడించారు.