కొందరు నాయకులు వారి నీడను వారే నమ్మరు: కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
- అలాంటి వారు పని చేయరు.. చేయనీయరని విమర్శ
- అలాంటి వారి వల్ల పార్టీ, ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన
- తన వంట నమ్మకమైన కార్యకర్తలు ఉన్నారన్న కొండా సురేఖ
నమ్మకమైన కార్యకర్తలు ఉన్నప్పుడే ఆ నాయకుడు ప్రశాంతంగా ఉండగలగుతారని అన్నారు. తన వెంట అలాంటి కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ల నీడను వాళ్లు నమ్మలేని పరిస్థితి ఉందని అన్నారు. పని చేయని ఎమ్మెల్యేలు, ఇంకొకరికి అడ్డుపడే ఎమ్మెల్యేల వద్దకు వెళ్లడం ఇష్టం ఉండదని అన్నారు. వాస్తవానికి అలాంటి వారి కారణంగా పార్టీ నష్టపోతోందని అన్నారు. కాగా, ఆమె పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.