ఉస్తాద్ భగత్ సింగ్: దమ్మున్నోడు దాటొచ్చు.. అదిరిపోయిన ట్రైలర్ టీజ్

  • ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ టీజ్ విడుదల
  • మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి సినిమా
  • ఇది భగత్ గీత అంటూ పవన్ కల్యాణ్ అదిరిపోయే డైలాగ్
  • గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్ పవన్ కాంబినేషన్
  • త్వరలోనే ఫుల్ ట్రైలర్ విడుదల చేయనున్న మేకర్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన చిత్రబృందం, తాజాగా 'ట్రైలర్ టీజ్' పేరుతో ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ టీజర్‌లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. "ఇందాక విన్నది భగవత్ గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" అంటూ పవన్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై హైప్‌ను పెంచగా, తాజా టీజర్ ఆ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వీడియోకు అదనపు బలాన్ని చేకూర్చింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సినిమా పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి స్థాయి ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. మొత్తానికి మార్చి 19న థియేటర్లలో పండగ చేసుకోవడానికి పవన్ అభిమానులు సిద్ధమవుతున్నారు.


More Telugu News