Rashmika Mandanna: 'భూమా దేవి' నా హృదయానికి దగ్గరైన పాత్ర: రష్మిక
- గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు 2025 ప్రకటన
- 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాకు రష్మికకు ఉత్తమ నటి అవార్డు
- భూమాదేవి పాత్ర నా మనసుకు చాలా దగ్గరైందన్న హీరోయిన్
- ఉత్తమ నటుడిగా 'తండేల్' హీరో నాగచైతన్య ఎంపిక
- ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగానూ 'తండేల్' విజయం
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్లో మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ఉత్సాహంగా ఉన్న రష్మిక.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 'గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు-2025'లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. శనివారం వెలువడిన ఈ ఫలితాల్లో 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రంలోని ఆమె అద్భుత నటనకు గాను ఈ అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. "గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా కృతజ్ఞురాలిని. ఈ సినిమాలో నేను పోషించిన 'భూమా దేవి' పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది" అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్, గీతా ఆర్ట్స్ సంస్థ, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ గౌరవం దక్కడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు రష్మిక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది తనకు ఎంతో విలువైనదని ఆమె వ్యాఖ్యానించారు.
మరోవైపు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) చైర్మన్ దిల్ రాజు విలేకరుల సమావేశంలో ఈ అవార్డుల విజేతలను ప్రకటించారు. 'తండేల్' చిత్రంలో అద్భుత నటనకు గాను అక్కినేని నాగచైతన్య 'ఉత్తమ నటుడు' అవార్డును గెలుచుకున్నారు. ఇదే చిత్రం 'ఉత్తమ జాతీయ సమైక్యత' చిత్రంగా కూడా నిలిచింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు 'ఉత్తమ వినోదాత్మక చిత్రం' అవార్డు లభించింది. 'ది గర్ల్‌ఫ్రెండ్' విషయానికి వస్తే.. కాలేజీలో ప్రేమలో పడిన ఒక అమ్మాయిని, ఆమె ప్రియుడు ఎలా తన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.