Allu Arjun: మరదలు నయనికా రెడ్డికి స్వాగతం పలికిన అల్లు అర్జున్

Allu Sirish and Nayanyika are one Welcomed into the family by Allu Arjun
  • అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహం
  • నయనిక రెడ్డితో ఏడడుగులు వేసిన శిరీష్
  • అన్న పెళ్లి రోజే తమ్ముడి వివాహం జరగడం విశేషం
  • అల్లు కుటుంబంలోకి స్వాగతం అంటూ బ‌న్నీ పోస్ట్‌
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు, నటుడు అల్లు శిరీష్ నిన్న‌ నయనిక రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకకు అల్లు, మెగా కుటుంబ సభ్యులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ శుభ సందర్భంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడు, మరదలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి నవ దంపతులతో దిగిన ఒక అందమైన ఫొటోను పంచుకున్నారు. "నా సోదరుడు శిరీష్, నయనిక సంతోషకరమైన వైవాహిక జీవితం గడపాలని కోరుకుంటున్నాను. అల్లు కుటుంబంలోకి స్వాగతం. నూతన దంపతులకు మీ ఆశీస్సులు, శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం. ఇట్లు అల్లు ఫ్యామిలీ" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఫొటోలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, వారి పిల్లలు, అల్లు అరవింద్ దంపతులు నూతన వధూవరులతో సంతోషంగా కనిపించారు.

మరోవైపు గ్లోబల్ రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ... "ప్రియమైన సోదరుడు అల్లు శిరీష్, నయనిక రెడ్డికి అభినందనలు. మీ ప్రయాణం ఆశీర్వాదాలతో నిండి ఉండాలి" అని రాసుకొచ్చారు. రామ్ చరణ్ పోస్ట్‌ను శిరీష్ తన సోషల్ మీడియాలో రీ-షేర్ చేస్తూ "థాంక్యూ స్వామి" అని బదులిచ్చారు. రామ్ చరణ్ ప్రస్తుతం దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. 

వివాహ వేడుకలో అల్లు శిరీష్ సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించగా, వధువు నయనిక రెడ్డి తెల్లటి పట్టుచీరలో సంప్రదాయ బంగారు ఆభరణాలు ధరించి ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి కూడా సంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజున అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం జరిగింది. ఇప్పుడు అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడు శిరీష్ కూడా వివాహం చేసుకోవడం అల్లు కుటుంబానికి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Allu Arjun
Allu Sirish
Nayanyika Reddy
Allu Aravind
Sneha Reddy
Ram Charan
Allu family wedding
Telugu cinema wedding
Tollywood news
Celebrity wedding

More Telugu News