AP Government: లస్కర్లకు గుడ్ న్యూస్.. వేతనాలు పెంచిన ఏపీ ప్రభుత్వం

AP Government Increases Wages for Outsourcing Laskars
  • ఏపీలో జలవనరుల శాఖ లస్కర్ల వేతనాల పెంపు
  • రోజువారీ వేతనాన్ని రూ. 350 నుంచి రూ. 550కి పెంచిన ప్రభుత్వం
  • లస్కర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు సర్కార్
  • పెంచిన వేతనాలు తక్షణమే అమలు చేయాలని ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న లస్కర్లకు శుభవార్త చెప్పింది. వారి రోజువారీ వేతనాలను గణనీయంగా పెంచుతూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వారి వేతనం రూ. 350 నుంచి రూ. 550కి పెరగనుంది.

లస్కర్లు చాలాకాలంగా తమ వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారి వినతిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వేతనాల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జలవనరుల శాఖ పరిధిలోని సీఏడీఏ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పెంచిన వేతనాలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ స్పష్టం చేశారు.

ఈ వేతనాల పెంపుతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రోత్సాహం అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను వెంటనే అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
AP Government
Andhra Pradesh Government
Laskars
Outsourcing Employees
Wage Hike
Salary Increase
Water Resources Department
G Sai Prasad
CADA Commissioner

More Telugu News