ఐరిస్ దేనాను ముంచివేయడానికి ముందే, మరో ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం
- శ్రీలంక తీరంలో ఐరిస్ దేనాను ముంచివేసిన అమెరికా
- అంతకుముందే, మరో నౌకను కొచ్చిలో నిలిపేందుకు అనుమతి కోరిన ఇరాన్
- మరుసటి రోజే అనుమతి ఇచ్చిన భారత అధికారులు
ఈ యుద్ధ నౌక తిరుగు ప్రయాణమైనప్పటికీ, మార్గమధ్యలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనితో కొచ్చిలో దీనిని నిలిపేందుకు ఫిబ్రవరి 28న ఇరాన్ అధికారులు అనుమతి కోరారు. భారత అధికారులు మరుసటి రోజే దీనికి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నౌక సహా అందులోని 183 మంది సిబ్బంది కొచ్చిలో ఆశ్రయం పొందుతున్నారు.