Allu Sirish: అల్లు శిరీష్ వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Allu Sirish Wedding Attended by CM Revanth Reddy
  • అల్లు అరవింద్ ఇంట మోగిన పెళ్లి బాజా
  • ప్రేయసి నయనిక మెడలో తాళి కట్టిన అల్లు శిరీష్
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి
  • కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్‌లో ప్రైవేట్‌గా వివాహ వేడుక
  • కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి నయనికతో శిరీష్ వివాహం ఈ శుక్రవారం (మార్చి 6, 2026) సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది. హైదరాబాద్‌లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్ వేదికగా జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అల్లు శిరీష్, నయనిక జంటకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వధూవరులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి సీఎం ఫోటోలు దిగారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.

గత నాలుగైదుళ్లుగా అల్లు శిరీష్, నయనిక ప్రేమించుకుంటున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి, నేడు పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది. కాగా, మూడు రోజుల క్రితమే వీరి ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరుకాగా.. నేడు జరిగిన పెళ్లిని మాత్రం అత్యంత ప్రైవేట్‌గా, సన్నిహితుల సమక్షంలో జరిపించడం విశేషం. ప్రస్తుతం అల్లు వారింట జరిగిన ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Allu Sirish
Allu Aravind
Allu Arjun
Revanth Reddy
Tollywood wedding
Nayani wedding
Hyderabad wedding
Telugu cinema
Celebrity wedding
Kollluru Aina Event Space

More Telugu News