50 యుద్ధ విమానాలతో ఖమేనీ బంకర్ ను ధ్వంసం చేశాం: ఐడీఎఫ్
- ఇరాన్ పై తాజాగా జరిగిన దాడిలో పాల్గొన్న 50 యుద్ధ విమానాలు
- టెహ్రాన్ లోని భూగర్భ బంకర్ పై ఇజ్రాయెల్ భీకర దాడి
- ఆపరేషన్ రోర్ ఆఫ్ ది హారియర్ పేరుతో ఇజ్రాయెల్ సైనిక చర్య
- ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఐడీఎఫ్ ప్రకటన
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఉపయోగించే భూగర్భ బంకర్ ను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. తాజా దాడిలో దాదాపు 50 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. 'ఆపరేషన్ రోర్ ఆఫ్ ది హారియర్' పేరుతో ఈ దాడిని నిర్వహించినట్లు తెలిపింది.
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన పక్కా సమాచారంతో, టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న లీడర్ షిప్ కాంప్లెక్స్ కింద నిర్మించిన భారీ భూగర్భ బంకర్ ను లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు జరిగాయి. అత్యవసర సమయాల్లో యుద్ధ కార్యకలాపాలు నిర్వహించడానికి, తమ మిలిటరీ ప్లాన్స్ అమలు చేయడానికి ఇరాన్ పాలకులు ఈ బంకర్ ను ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి నిర్మించుకున్నారని ఐడీఎఫ్ పేర్కొంది. అనేక వీధులకు విస్తరించి ఉన్న ఈ బంకర్ లో సీనియర్ అధికారుల కోసం మీటింగ్ రూమ్ లు, ఎంట్రీ పాయింట్లు ఉన్నాయని, దీనిని ఖమేనీ వినియోగించుకునేలోపే ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వివరించింది.
ఖమేనీ హతం తర్వాత కూడా ఇరాన్ సీనియర్ అధికారులు ఈ కాంప్లెక్స్ ను వినియోగిస్తున్నారని ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడి ద్వారా ఇరాన్ అత్యంత కీలకమైన కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను దెబ్బతీశామని, ఇది ఆ దేశ మిలిటరీ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇరాన్ లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఈ ప్రాంతాన్ని సుదీర్ఘ నిఘా అనంతరం ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.