రాష్ట్రంలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు: సీఎం రేవంత్
- నకిలీ ఉద్యోగులను సృష్టించిన ఏజెన్సీలపై ఆడిట్ చేసి కేసులు పెట్టాలని ఆదేశం
- మార్చి 6 నుంచి 99 రోజుల పాటు 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం
- ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై కఠినంగా లేకుంటే కలెక్టర్లపై చర్యలని హెచ్చరిక
రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన తీవ్రంగా ఆదేశించారు. కలెక్టర్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని అమలు చేయడంపై ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల భాగస్వామ్యంతో ఈ ప్రణాళికను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఈ నెల 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం సేకరణలో మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారి నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కలెక్టర్లు, ఎస్పీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, దానికి సంబంధించిన కార్యక్రమాలను ఒక వేడుక వాతావరణంలో జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు.