ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం, మోదీ గొప్ప స్నేహితుడన్న నెతన్యాహు

Narendra Modi Speaks at Israel Parliament Netanyahu Praises Modi
ఇజ్రాయెల్ పార్లమెంటులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో అండగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హామీ ఇచ్చారు. మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదానికి తాము పూర్తి వ్యతిరేకమని, భారత్ దశాబ్దాలుగా ఈ సమస్యతో ఇబ్బందిపడుతోందని అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి ప్రధానిని తానేనని, దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మోదీ అన్నారు.

భారత్, ఇజ్రాయెల్ ప్రాచీన నాగరికత కలిగిన దేశాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని సహించే పరిస్థితి లేదని అన్నారు. హమాస్ దాడి చేసి పౌరులను చంపడం దారుణమని అన్నారు. ఇజ్రాయెల్‌కు అనేక అంశాల్లో భారత్ అండగా నిలుస్తోందని మోదీ తెలిపారు. హమాస్ దాడుల తర్వాత మీ బాధలను భారత్ పంచుకుందని అన్నారు. ఉనికి కోసం యూదులు చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు.

ఉగ్రవాదం విషయంలో ఏ దేశమైనా ద్వంద్వ వైఖరిని విడనాడాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధమని, తాము శాంతిని కోరుకునే వాళ్లమని అన్నారు. ఇజ్రాయెల్ అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము మరిచిపోలేమని అన్నారు. యూదులు ఉనికి కోసం అనేక కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. రక్షణ, భద్రత విషయంలో రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఇజ్రాయెల్ సాయంతో భారత్ వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం ఆ దేశ ప్రధాని నెతన్యాహు మాట్లాడారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఎంతో సంతోషకరమని, ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడని ప్రశంసించారు. తనకు మోదీ స్నేహితుడికంటే ఎక్కువ అన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. అనేక సమయాల్లో ఇజ్రాయెల్‌కు భారత్ అండగా నిలబడిందని గుర్తు చేసుకున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Israel
Benjamin Netanyahu
India Israel relations
terrorism
Hamas attack
Indian Prime Minister

More Telugu News