"ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు".. అధికారులతో సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు
- రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ఘటనలపై ఆరా
- శ్రీకాకుళం డయేరియా బాధితుల్లో ఇద్దరికి సీరియస్
- మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సీఎంకు తెలిపిన అధికారులు
ప్రజారోగ్యం విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. శ్రీకాకుళంలో విజృంభిస్తున్న డయేరియా, రాజమహేంద్రవరంలో కలకలం రేపిన కల్తీ పాల ఘటనలపై బుధవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళంలో డయేరియా బారిన పడి ప్రస్తుతం 76 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు.
జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని.. ఒకరికి వెంటిలేటర్‌పై, మరొకరికి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా క్లీన్ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కాగా, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా స్వయంగా పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
రాజమహేంద్రవరం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. పాల శాంపిల్స్ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మున్సిపల్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.