Tirumala: తిరుమలలో భక్తురాలికి పాము కాటు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
- తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లో భక్తురాలికి పాముకాటు
- తెలంగాణకు చెందిన మౌనికగా బాధితురాలి గుర్తింపు
- ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఓ భక్తురాలు పాముకాటుకి గురవడంతో కలకలం రేగింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు ఈరోజు తెల్లవారుజామున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆమెను పాము కాటేసింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఆమెను హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారాన్ని ఆమె కుటుంబసభ్యులకు అందించినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులు వేచి ఉండే క్యూలైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు భక్తులకు హామీ ఇచ్చారు.