దేశంలోనే వేగవంతమైన మెట్రో... మీరట్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ

Narendra Modi Inaugurates Fastest Metro in Meerut
షార్ట్స్‌లో చూడండి
దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఈ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఈ మెట్రో గంటకు గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ మీరట్ మెట్రో దేశంలోనే అతి వేగవంతమైన మెట్రో వ్యవస్థగా నిలిచింది.  మీరట్ మెట్రో సేవలు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆధునిక రవాణా వ్యవస్థతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా నమో భారత్ రైలు సేవలను కూడా ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీ-మీరట్ మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) కారిడార్‌పైనే మీరట్ మెట్రో కూడా నడవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. దేశంలో ఒకే మౌలిక వసతులపై రెండు వేర్వేరు రైలు సేవలు నడవడం ఇదే తొలిసారి. నమో భారత్ రైలు సాధారణంగా గంటకు 160 కి.మీ., గరిష్ఠంగా 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రూ.12,390 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. 82 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించారు. దీంతో ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. 


Go Back to Shorts
Narendra Modi
Meerut Metro
Uttar Pradesh
Namo Bharat
RRTS Corridor
Delhi Meerut
Rapid Transit System
Metro Services
Yogi Adityanath

More Telugu News