Neal Katyal: ట్రంప్ అధిక సుంకాలకు చెక్ పెట్టిన భారత సంతతి న్యాయవాది... ఎవరీ నీల్ కత్యాల్?
- సుప్రీంకోర్టు తీర్పు రావడంలో కీలక పాత్ర పోషించిన నీల్ కత్యాల్
- 2010లో ఒబామా హయాంలో యూఎస్ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించిన కత్యాల్
- 2017 నుంచి ట్రంప్ పలు నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులలో వాదనలు
ప్రపంచంలోని ఎన్నో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన ఆ సుంకాలను రద్దు చేస్తూ తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 6-3తో తీర్పును వెలువరించింది. ప్రతీకార సుంకాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ తీర్పు రావడంలో భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ పాత్ర ఎంతో ఉంది.
ట్రంప్ అధిక సుంకాలను వ్యతిరేకిస్తూ చిన్న చిన్న వ్యాపారులు, డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాల కూటమి తరఫున నీల్ కత్యాల్ సుప్రీంకోర్టులో బలమైన వాదనలను వినిపించారు. తమ ఆదేశాలు పాటించని దేశాలపై అధిక టారిఫ్‌లు విధించడానికి ట్రంప్ 1977 నాటి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని నీల్ కత్యాల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
నీల్ కత్యాల్ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. తల్లి ప్రతిభ వైద్యురాలు కాగా, తండ్రి సురేందర్ ఇంజినీర్‌గా పని చేశారు. డార్క్ మౌత్ కాలేజీ, యేల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్టీఫెన్ బ్రేయర్కు క్లర్క్‌గా పని చేశారు. 2010లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో యూఎస్ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు.
సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులను వాదించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 2017 నుంచి ఆయన పలుమార్లు కోర్టులలో వాదనలు వినిపించారు. 2017లో కొన్ని దేశాలపై ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనలు వినిపించారు. అమెరికాలో సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మిన్నోసోటా ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా వాదనలు వినిపించారు.
ప్రస్తుతం కత్యాల్ మిల్ బ్యాంక్ ఎల్ఎల్పీలో భాగస్వామిగా ఉన్నారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీ లా సెంటర్లో పాల్ సాండర్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నీల్ కత్యాల్ రాజ్యాంగ మరియు సంక్లిష్టమైన అప్పిలేట్ వ్యాజ్యాలలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. పర్యావరణ, జాతీయ భద్రతా వివాదాలలో వాదనలు వినిపించి గెలిచారు. అమెరికా న్యాయ విభాగం నుంచి అత్యున్నత పురస్కారం 'ఎడ్మండ్ రాండోల్ఫ్' అవార్డును అందుకున్నారు.