Raipur Incident: పెట్రోల్ బంకులో సిగరెట్ తాగొద్దన్నందుకు ఫ్యూయల్ ట్యాంకుకు నిప్పంటించాడు
- ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో ఘటన
- రెండు రోజుల క్రితం పెట్రోల్ బంకుకు వచ్చిన ఇద్దరు యువకులు
- ఒక వ్యక్తి పెట్రోల్ పోయిస్తుండగా పక్కనే సిగరెట్ అంటించే ప్రయత్నం చేసిన రెండో యువకుడు
- మొదటి యువకుడు వారించడంతో ఫ్యూయల్ ట్యాంకులోకి లైటర్ విసిరిన వైనం
- అప్రమత్తమై మంటలను ఆర్పివేసిన పెట్రోల్ బంకు సిబ్బంది
పెట్రోల్ బంకులో సిగరెట్ తాగవద్దన్నందుకు ఒక యువకుడు పెట్రోల్ నింపుకుంటున్న ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంకుకు నిప్పంటించాడు. పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఫిబ్రవరి 18న రాత్రి సమయంలో ఒక పెట్రోల్ బంకు వద్దకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఒక వ్యక్తి పెట్రోల్ పోయిస్తుండగా, వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ దిగి పక్కనే సిగరెట్ అంటించుకునే ప్రయత్నం చేశాడు. బండిపై కూర్చున్న వ్యక్తి ఇది చూసి సిగరెట్ తాగవద్దని వారించాడు. పక్కకు వెళ్లు అన్నట్లు నెట్టివేశాడు. దీంతో ఆ వ్యక్తి లైటర్‌ను బైక్ పెట్రోల్ ట్యాంకులో వేశాడు.
ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో వారు అక్కడి నుంచి దూరంగా పరుగుపెట్టారు. క్షణాల్లో అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.