Prabhas: నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది: ప్రభాస్
- 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్ తో ముచ్చటించిన ప్రభాస్
- ప్రేమపై అభిప్రాయం ఏమిటని ప్రభాస్ ను ప్రశ్నించిన మానస వారణాసి
- ఆ మూమెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానన్న ప్రభాస్
ఇప్పటివరకు పెళ్లి గురించి అడిగితే నవ్వేసి దాటవేసేవాడు రెబల్ స్టార్ ప్రభాస్. అనుష్క నుంచి కృతి సనన్ వరకు ఎన్నో పేర్లు లింక్ అయినప్పటికీ... ఆయన ఒక్కసారి కూడా సీరియస్ గా సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు మొదటిసారిగా ఆయన మనసులోని అసలు కోరికను బయటపెట్టి... అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
టాలీవుడ్ లో తాజాగా విడుదల అయిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. మరోవైపు, ఈ మూవీ టీమ్‌తో ప్రభాస్ ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ ఇంటర్వ్యూలో హీరోయిన్ మానస వారణాసి ప్రభాస్ ను ఒక ప్రశ్న సూటిగా అడిగేసింది: “ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి డార్లింగ్?” అని ఆమె ప్రశ్నించగా... ప్రభాస్ కాసేపు సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత “ఇది నీ పర్సనల్ క్వశ్చన్ కదా” అని మొదలెట్టి, తర్వాత ఇలా చెప్పేశాడు. “నిజం చెప్పాలంటే... నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. ఆ అద్భుతమైన ఫీలింగ్ ను అనుభవించాలని ఉంది. ఆ మూమెంట్ కోసం నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పాడు. ప్రభాస్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే... ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్-2, స్పిరిట్, ఫౌజీ, కల్కి-2 వంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.