మీకో నమస్కారం... మీడియాతో ఒక్క ముక్క మాట్లాకుండా చిరునవ్వుతో వెళ్లిపోయిన ఐబొమ్మ రవి

Telangana
Advertisement
  • సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్
  • చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం సాయంత్రం విడుదల
  • మీడియా ప్రశ్నలకు మౌనంగా, చిరునవ్వుతోనే సమాధానం
  • పాస్‌పోర్టు స్వాధీనం చేసి, రోజూ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని షరతు
  • గతేడాది నవంబర్‌లో అరెస్ట్ కాగా, 90 రోజులుగా జైలులో ఉన్న రవి
Advertisement
సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ‘ఐబొమ్మ’ రవి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలంగాణ హైకోర్టు మంగళవారం అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం సాయంత్రం రవి జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి బయటికి వచ్చిన సందర్భంగా మీడియా అతడిని మాట్లాడించే ప్రయత్నం చేసింది. 

మిమ్మల్ని పైరసీ దొంగ అంటున్నారు... దానికి మీరేమంటారు అంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. అందుకు రవి చిరునవ్వే సమాధానంగా, రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతూ ముందుకు సాగిపోయాడు. మీడియా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అతడు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కారులో ఎక్కిన తర్వాత కూడా మీడియా ప్రతినిధులకు నమస్కారం పెడుతూ, చిరునవ్వే సమాధానం అన్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు.

గతేడాది నవంబర్‌లో ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్నాడన్న ఆరోపణలతో సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్టు చేశారు. అతనిపై ఐదు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈనాడు కథనం ప్రకారం, హైకోర్టు అతనికి పలు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని, తన పాస్‌పోర్టును కోర్టులో స్వాధీనం చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని స్పష్టం చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

Ibomma RaviIbommaMovie PiracyTelangana High CourtCyber CrimeChanchalguda JailRavi ImandiTollywoodPiracy Website

More Telugu News

ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్.. పౌర హక్కుల విభాగం చీఫ్ హర్మీత్ థిల్లాన్ రాజీనామా

06 Nov, 06:43

బోస్టన్‌లో నల్గొండ యువతి అదృశ్యం... కొనసాగుతున్న గాలింపు

06 Nov, 06:28

చంద్రబాబుపై కేసులు.. సీబీఐ విచారణ పిల్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు

05 Nov, 23:27

చికిత్స పేరుతో పిలిపించి చితక్కొట్టారు.. యువ వైద్యుడిని ట్రాప్ చేసిన మలయాళ నటి!

05 Nov, 22:38

క్లీన్ 'యు' సర్టిఫికెట్‌తో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్'.. రేపే గ్రాండ్ రిలీజ్

05 Nov, 22:29

చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్

05 Nov, 22:12

రజనీకాంత్ పుట్టినరోజు.. నెల రోజుల పాటు వేడుకలు జరపనున్న లారెన్స్

05 Nov, 21:55

రాహుల్ ర్యాలీకి గైర్హాజరు: మేనమామ పెద్దకర్మకు వెళ్లినా యూత్ కాంగ్రెస్ నేతపై వేటు!

05 Nov, 21:46

దేశవ్యాప్తంగా వందే భారత్ హవా.. నిండిపోతున్న సీట్లు, స్లీపర్లకు ఫుల్ డిమాండ్

05 Nov, 21:37

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2026.. ఫలితాలు వచ్చేశాయి!

05 Nov, 21:19

కిరణ్ తో సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసిన రామ్ చరణ్

05 Nov, 21:08

గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు.. తృటిలో బయటపడ్డ ఎమ్మెల్యే వీరేశం

05 Nov, 20:52

'సమ్మర్ హాలిడేస్' ట్రైలర్‌కు విశేష స్పందన.. పాజిటివ్ బజ్‌తో రేపు థియేటర్లలోకి!

05 Nov, 20:36

టీ20 సిరీస్ విజయం తర్వాత.. ఆక్లాండ్‌ శరవణ భవన్‌లో సందడి చేసిన గంభీర్

05 Nov, 20:24

కజకిస్థాన్‌కు చేరిన 'జనవరి 12 విడుదల'.. వెంకటేశ్, కల్యాణ్ రామ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్

05 Nov, 20:13
..More Telugu News