తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్

ఈ నెల 25వ తేదీ నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజవుతున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మరోవైపు ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను ఈరోజు విడుదల చేశారు. ఆయా కళాశాలల ఆన్ లైన్ లాగిన్లతో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. 

విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి హాట్ టికెట్లు తీసుకోవాలని అధికారులు సూచించారు. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా హాల్ టికెట్లను పొందే సదుపాయాన్ని కల్పించారు. బోర్డు వద్ద విద్యార్థులు నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్ ను పంపిస్తున్నట్టు బోర్డు తెలిపింది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉన్నట్టు గుర్తిస్తే... వెంటనే ప్రిన్సిపాళ్ల ద్వారా బోర్డు దృష్టికి తీసుకొచ్చి, తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పారు. 

మరోవైపు ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Telangana Inter Board
Telangana
Inter Exams
Hall Tickets
QR Code
Education
Student
Exams 2024
Intermediate Exams
TS Inter

More Telugu News