ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు అసహనం.. ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామని మండిపాటు!

National
Advertisement
  • అందరికీ ఉచిత విద్యుత్తును ప్రకటించిన స్టాలిన్ ప్రభుత్వం
  • రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా ఉచిత విద్యుత్ ఎలా ఇస్తారన్న సుప్రీం
  • ఉచితాల వల్ల దేశ అభివృద్ధి దెబ్బతింటుందని వ్యాఖ్య
Advertisement

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకమవుతాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్తు ఇవ్వడం కన్నా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టిపై దృష్టి సారించాలని సూచించింది. 


తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ ఉచిత విద్యుత్తు ప్రకటనపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. వినియోగదారుల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వంపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఉచిత విద్యుత్తును ఎలా అందిస్తారని ప్రశ్నించింది.


చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతోందని... అయినప్పటికే ఉచిత పథకాల పంపిణీ జరుగుతోందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ఉచిత పథకాల వల్ల దేశ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. సంక్షేమ పథకాల్లో భాగంగా కరెంట్ బిల్లులు చెల్లించలేని వారికి ఉచిత విద్యుత్ అందిస్తామంటే ఒక అర్థం ఉంటుందని... కానీ, మీరు ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఆహారం, విద్యుత్ ఇలా అన్నీ ఫ్రీగా ఇస్తూ... మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామని ప్రశ్నించింది. 

ఎన్నికలకు ముందే రాష్ట్రాలు ఇలాంటి ఉచిత పథకాలను ఎందుకు తీసుకొస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో అన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే... అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా కూడా మిగలదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

Supreme CourtFree schemesState governmentsEconomic growthChief Justice SuryakantDMKTamil NaduFree electricityRevenue deficit

More Telugu News

ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్.. పౌర హక్కుల విభాగం చీఫ్ హర్మీత్ థిల్లాన్ రాజీనామా

06 Nov, 06:43

బోస్టన్‌లో నల్గొండ యువతి అదృశ్యం... కొనసాగుతున్న గాలింపు

06 Nov, 06:28

చంద్రబాబుపై కేసులు.. సీబీఐ విచారణ పిల్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు

05 Nov, 23:27

చికిత్స పేరుతో పిలిపించి చితక్కొట్టారు.. యువ వైద్యుడిని ట్రాప్ చేసిన మలయాళ నటి!

05 Nov, 22:38

క్లీన్ 'యు' సర్టిఫికెట్‌తో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్'.. రేపే గ్రాండ్ రిలీజ్

05 Nov, 22:29

చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్

05 Nov, 22:12

రజనీకాంత్ పుట్టినరోజు.. నెల రోజుల పాటు వేడుకలు జరపనున్న లారెన్స్

05 Nov, 21:55

రాహుల్ ర్యాలీకి గైర్హాజరు: మేనమామ పెద్దకర్మకు వెళ్లినా యూత్ కాంగ్రెస్ నేతపై వేటు!

05 Nov, 21:46

దేశవ్యాప్తంగా వందే భారత్ హవా.. నిండిపోతున్న సీట్లు, స్లీపర్లకు ఫుల్ డిమాండ్

05 Nov, 21:37

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2026.. ఫలితాలు వచ్చేశాయి!

05 Nov, 21:19

కిరణ్ తో సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసిన రామ్ చరణ్

05 Nov, 21:08

గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు.. తృటిలో బయటపడ్డ ఎమ్మెల్యే వీరేశం

05 Nov, 20:52

'సమ్మర్ హాలిడేస్' ట్రైలర్‌కు విశేష స్పందన.. పాజిటివ్ బజ్‌తో రేపు థియేటర్లలోకి!

05 Nov, 20:36

టీ20 సిరీస్ విజయం తర్వాత.. ఆక్లాండ్‌ శరవణ భవన్‌లో సందడి చేసిన గంభీర్

05 Nov, 20:24

కజకిస్థాన్‌కు చేరిన 'జనవరి 12 విడుదల'.. వెంకటేశ్, కల్యాణ్ రామ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్

05 Nov, 20:13
..More Telugu News