Mallu Bhatti Vikramarka: ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, 28న బడ్జెట్

త్వరలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 23వ తేదీన మంత్రివర్గ సమావేశం అనంతరం బడ్జెట్ సమావేశాల తేదీని ప్రకటించనున్నారు. పది నుంచి పదిహేను రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా మంత్రులు, అధికారులతో సమావేశమై ప్రతిపాదనలను స్వీకరించారు.
Mallu Bhatti Vikramarka
Telangana Budget
Telangana Budget 2024
Telangana Assembly
Telangana Government

More Telugu News