భూమి వైపు జారుతున్న నాసా టెలిస్కోప్.. కాపాడేందుకు భారీ ఆపరేషన్
- భూమి వైపు జారుతున్న నాసా స్విఫ్ట్ అబ్జర్వేటరీ
- సౌర తుపాను కారణంగా వేగంగా క్షీణిస్తున్న కక్ష్య
- రెస్క్యూ మిషన్ కోసం శాస్త్రీయ కార్యకలాపాల పాక్షిక నిలిపివేత
- రోబోటిక్ స్పేస్‌క్రాఫ్ట్‌తో తిరిగి పైకి పంపేందుకు 30 మిలియన్ డాలర్లతో ప్రయోగం
- విజయవంతమైతే స్విఫ్ట్‌కు మరో పదేళ్ల జీవితకాలం
రెండు దశాబ్దాలుగా అంతరిక్షంలోని భారీ పేలుళ్లను శోధిస్తున్న నాసాకు చెందిన నీల్ గెరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ ప్రమాదంలో పడింది. భూమి కక్ష్య నుంచి నెమ్మదిగా జారుతూ భూమి వైపు దూసుకొస్తోంది. దీన్ని కాపాడేందుకు నాసా ఒక సాహసోపేతమైన రెస్క్యూ మిషన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, అబ్జర్వేటరీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా దాని శాస్త్రీయ కార్యకలాపాలను ఫిబ్రవరి 11 నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది.
2004లో ప్రయోగించిన ఈ అబ్జర్వేటరీ, గామా కిరణాల పేలుళ్లను అధ్యయనం చేస్తూ ఖగోళ శాస్త్రంలో కీలక సమాచారం అందించింది. అయితే, ప్రస్తుతం సౌర చక్రం 25 (సోలార్ సైకిల్ 25) కారణంగా భూ వాతావరణం పైపొరలు వేడెక్కాయి. దీనివల్ల ఏర్పడిన ఘర్షణకు స్విఫ్ట్ కక్ష్య క్రమంగా క్షీణిస్తూ, 600 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రస్తుతం 400 కిలోమీటర్ల దిగువకు చేరింది.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నాసా అమెరికాకు చెందిన 'కాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్' అనే ప్రైవేట్ సంస్థతో 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 250 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది వేసవిలో 'లింక్' అనే రోబోటిక్ వ్యోమనౌకను ప్రయోగించి, స్విఫ్ట్‌కు దాన్ని జోడించి, తిరిగి 600 కిలోమీటర్ల సురక్షిత కక్ష్యలోకి నెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ సన్నాహాల కోసమే ప్రస్తుతం టెలిస్కోప్‌ను స్థిరంగా ఉంచి, కార్యకలాపాలను పాక్షికంగా ఆపేశారు. అయితే, దానిలోని బరస్ట్ అలర్ట్ టెలిస్కోప్ (BAT) మాత్రం పనిచేస్తూనే ఉంటుందని నాసా తెలిపింది.
ఈ రెస్క్యూ ప్రయోగం విజయవంతమైతే, అంతరిక్షంలో మరమ్మతులకు సిద్ధంగా లేని ఉపగ్రహాన్ని ఒక ప్రైవేట్ సంస్థ కాపాడటం ఇదే తొలిసారి అవుతుంది. అంతేకాకుండా, స్విఫ్ట్ అబ్జర్వేటరీ మరో దశాబ్దం పాటు తన సేవలను అందిస్తుందని నాసా శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఒకవేళ విఫలమైతే, 2026 చివరి నాటికి ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించి పూర్తిగా కాలిపోతుంది.