Telangana BC Reservations: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు.. కేంద్రం నుంచి కీలక ప్రకటన

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. దీనితో కేంద్ర మంత్రి బీఎల్ వర్మ వివరణ ఇచ్చారు. రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయని, అవి పరిశీలనలో ఉన్నాయని స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్ పెంపునకు సంబంధించి తెలంగాణ శాసనసభ కార్యదర్శి నుంచి రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి వచ్చాయని తెలిపారు. ఈ బిల్లులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం తెలిసిందే. 
Telangana BC Reservations
BC Reservations
Telangana
Eetala Rajender
BL Verma
Reservation Bills

More Telugu News