Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

Ali Khamenei Breaks 37 Year Tradition Attending Air Force Meeting
  • వైమానికదళ అధికారులతో జరిగే సమావేశానికి హాజరుకాని ఖమేనీ
  • 1989 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం
  • అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కార్యక్రమానికి దూరంగా ఖమేనీ

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. 1989 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8న వైమానికదళ అధికారులతో జరుగుతున్న సమావేశానికి ఈసారి హాజరు కాలేదు. ఇరాన్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం, ఈ సమావేశం 1979 ఫిబ్రవరి 8న వైమానిక దళ అధికారులు రూహుల్లా ఖమేనీకి విధేయత చూపిన రోజును గుర్తుచేస్తుంది. కోవిడ్ సమయంలో కూడా ఖమేనీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


ఈసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దోల్రహీం మౌసవి వైమానిక దళ అధికారులతో సమావేశమయ్యారు. అమెరికాతో విభేదాలు ముదిరిన నేపథ్యంలో, భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమానికి ఖమేనీ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. 


ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. యూఎస్ నిమిట్జ్-క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అరేబియన్ సముద్రంలో ఉంది. జోర్డాన్‌లోని మువఫ్ఫక్ సల్తి ఎయిర్ బేస్‌కు డజన్ల కొద్దీ ఎఫ్-15 ఫైటర్ జెట్లు, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్, ఎ-10సి థండర్‌బోల్ట్ II గ్రౌండ్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ చేరాయి. రెడ్ సీలో యూఎస్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ డెల్బర్ట్ డి బ్లాక్, గల్ఫ్‌లో ఎంక్యూ-4సి ట్రైటన్ సర్వైలెన్స్ డ్రోన్ కూడా కనిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ట్రంప్ ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి.

Ali Khamenei
Iran
Supreme Leader
Ayatollah Ali Khamenei
Iran US tensions
US Military
Middle East
Military Meeting
Abdolrahim Mousavi
Iranian Air Force

More Telugu News