రోహిత్ శర్మకు టీ ఆఫర్ చేసిన ముకేష్ అంబానీ.. వైరల్ వీడియో ఇదిగో!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తన సింప్లిసిటీతో మరోసారి వార్తల్లో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన స్వయంగా టీ ఆఫర్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

భారత్, అమెరికా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీతో కలిసి వీఐపీ బాక్స్‌కు హాజరయ్యారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మను అంబానీ కుటుంబం ఆప్యాయంగా పలకరించింది. ఈ క్రమంలో ముకేశ్ అంబానీ ఒక కప్పులో టీ తీసుకుని రోహిత్‌కు అందించగా, అతను అంతే వినయంగా వద్దని సున్నితంగా తిరస్కరించాడు.

ఈ చిన్న దృశ్యం కెమెరాలో రికార్డ్ అవడంతో క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ముకేశ్ అంబానీ నిరాడంబరతను పలువురు ప్రశంసిస్తుండగా, ఫిట్‌నెస్ పట్ల రోహిత్ శర్మ చూపుతున్న నిబద్ధతను క్రీడాభిమానులు కొనియాడుతున్నారు. "ప్రపంచ కప్ లక్ష్యంగా ఉన్నప్పుడు అంబానీ ఇచ్చే స్నాక్స్ కూడా లెక్కకాదు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


More Telugu News