ఇండియాతో ఆడే విషయంలో పాకిస్థాన్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చు: ఇర్ఫాన్ పఠాన్

  • ఈ నెల 15న ఇండియా - పాకిస్థాన్ మధ్య మ్యాచ్
  • ఇండియాతో మ్యాచ్ ను బహిష్కరించిన పాకిస్థాన్
  • తన నిర్ణయం విషయంలో పాక్ యూటర్న్ తీసుకుంటుందన్న ఇర్ఫాన్ పఠాన్
టీ20 వరల్డ్ కప్ ఈరోజు ప్రారంభమయింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య కొలంబోలో తొలి మ్యాచ్ జరుగుతోంది. మరోవైపు, ఈ నెల 15న ఇండియా - పాకిస్థాన్ మధ్య కొలంబోలో హైవోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ ను తాము ఆడబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

గ్రూప్ స్టేజ్ లో మనకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇర్ఫాన్ అన్నాడు. భారత్ తో ఆడకూడదని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుందని... ఆ నిర్ణయం విషయంలో పాక్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చని చెప్పాడు. ఒకవేళ వాళ్లు యూటర్న్ తీసుకుని మనతో ఆడాలనుకున్నా... మనకు ఛాలెంజ్ విసిరేంత సామర్థ్యం వాళ్లకు ఉందా? అని ఎద్దేవా చేశాడు. మనల్ని పాకిస్థాన్ ఛాలెంజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నాడు. 

ఇక టీ20 వరల్డ్ కప్ లో ఈనాటి మ్యాచ్ ల విషయానికి వస్తే... ప్రస్తుతం పాక్ - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండో మ్యాచ్ కోల్ కతాలో మధ్యాహ్నం 3 గంటలకు వెస్టిండీస్ - స్కాట్లాండ్ మధ్య జరగనుంది. మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు భారత్ - యూఎస్ఏ మధ్య జరగబోతోంది.


More Telugu News