పాకిస్థాన్ నిర్ణయంతో సంబంధం లేకుండా కొలంబోకు వెళుతున్నాం: సూర్యకుమార్ యాదవ్

  • మ్యాచ్ ఆడకూడదని తమకు ఎలాంటి సూచనలు అందలేదని వెల్లడి
  • పాకిస్థాన్ నిర్ణయం తమ నియంత్రణలో ఉండదన్న సూర్యకుమార్ యాదవ్
  • మేం కొలంబోకు వెళ్లడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నామన్న సూర్య కుమార్ యాదవ్
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు. పాకిస్థాన్ వైఖరితో సంబంధం లేకుండా టీమిండియా కొలంబోకు వెళుతుందని అన్నాడు. మ్యాచ్ ఆడకూడదని తమకు ఎలాంటి సూచనలు అందలేదని స్పష్టం చేశాడు.

పాకిస్థాన్ నిర్ణయం తమ నియంత్రణలో ఉండదని అన్నాడు. మ్యాచ్ ఆడాలో, వద్దో నిర్ణయం వారిదే అన్నాడు. ఆసియా కప్‌లో తాము పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడామని గుర్తు చేశాడు.

తమ మైండ్ సెట్ చాలా స్పష్టంగా ఉందని, పాక్ జట్టుతో ఆడబోమని తాము చెప్పడం లేదని అన్నాడు. ఈ మ్యాచ్‌ను ఐసీసీ షెడ్యూల్ చేసిందని, కానీ వారే (పాకిస్థాన్) వద్దనుకుంటున్నారని పేర్కొన్నాడు. మేం కొలంబో వెళ్లడానికి టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నామని అన్నాడు. ఫిబ్రవరి 7న అమెరికాతో ఆడాల్సిన మ్యాచ్‌పై తాము దృష్టి సారించామని అన్నాడు.


More Telugu News

Suryakumar Yadav India vs Pakistan T20 World Cup Colombo Pakistan boycott ICC Team India