రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్ వెనక్కి తీసుకోవాలని హార్వర్డ్ వర్సిటీకి లేఖ పంపాను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హార్వర్డ్ ఇచ్చిన సర్టిఫికెట్‌పై తీవ్ర అభ్యంతరం
- సర్టిఫికెట్‌ను తక్షణమే రద్దు చేయాలని హార్వర్డ్ యూనివర్సిటీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ
- రేవంత్‌పై 89 క్రిమినల్ కేసులున్నాయని, ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని ఆరోపణ
- ఎలాంటి పరిశీలన లేకుండా వివాదాస్పద వ్యక్తులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారని హార్వర్డ్‌పై విమర్శ
- తన పూర్వ విద్యాలయం ఇలాంటి స్థాయికి దిగజారడం సిగ్గుచేటని ప్రవీణ్ కుమార్ ఆవేదన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల జారీ చేసిన సర్టిఫికెట్‌పై తీవ్ర వివాదం రేగింది. ఈ సర్టిఫికెట్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అదే యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గురువారం హార్వర్డ్ అధ్యక్షుడికి, డీన్‌కు ఘాటైన ఈ-మెయిల్ పంపారు. దేశంలోనే అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న, ఓటుకు నోటు కేసులో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికి జైలు జీవితం గడిపిన వ్యక్తికి హార్వర్డ్ సర్టిఫికెట్ ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రవీణ్ కుమార్ తన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డును ప్రస్తావిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. "దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనన్ని క్రిమినల్ కేసులు (89) ఎదుర్కొంటూ, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికి, దాదాపుగా 50 రోజులు జైలులో గడిపి, ఇప్పుడు సీఎంగా పలు కుంభకోణాలకు పాల్పడుతూ, తెలంగాణ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ప్రతిచోటా ప్రత్యర్థులపై అభ్యంతరకరమైన భాషను ప్రయోగిస్తున్న ఇలాంటి రాజకీయ నాయకుడు 21వ శతాబ్దానికి పనికిరాడు. ప్రాచీన రాతి యుగంలో కూడా ఇలాంటి నాయకులు ఉండి ఉండరు. ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడికి హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వడం దేనికి సంకేతం?" అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు తాను హార్వర్డ్‌కు పంపిన ఈ-మెయిల్ సారాంశాన్ని ఆయన మీడియాకు విడుదల చేశారు.
గౌరవనీయ అధ్యక్షులు మిస్టర్ అలన్ గార్బర్, డీన్ మిస్టర్ వెయిన్‌స్టీన్‌లకు,
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (HKS) పూర్వ విద్యార్థిగా (MC-MPA 2012, ఎడ్వర్డ్ ఎస్ మాసన్ ఫెలో) నేను ఈ లేఖను తీవ్రమైన నిరాశ, ఆగ్రహంతో రాస్తున్నాను. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ అనుముల రేవంత్ రెడ్డికి '21వ శతాబ్దంలో నాయకత్వం: గందరగోళం, సంఘర్షణ, ధైర్యం' అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
మీ ఈ నిర్ణయం, సంస్థాగత బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా ఉంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విశ్లేషించిన అఫిడవిట్ల ప్రకారం, శ్రీ రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది భారత దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధికం. వీటిలో 72 తీవ్రమైన IPC సెక్షన్ల కింద నమోదైన కేసులున్నాయి. 2015లో అపఖ్యాతి పాలైన ఓటుకు నోటు కుంభకోణంలో, తోటి శాసనసభ్యుడికి లంచం ఇవ్వజూపుతుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయి, దాదాపు 50 రోజులు జైలులో ఉన్నారు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ, బహిరంగంగా కుల, మతపరమైన విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రత్యర్థులపై, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన, అన్‌పార్లమెంటరీ భాషను ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థులను వేధించడానికి తప్పుడు కేసులను ఆయుధంగా వాడుతున్నారు. ఆయన ప్రవర్తన, HKS తన తరగతి గదుల్లో నేర్పుతుందని చెప్పుకునే నైతిక నాయకత్వం, నాగరికత, ప్రజాసేవ వంటి విలువలను అపహాస్యం చేస్తోంది.
సుమారు 400 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నైతిక విలువలతో కూడిన నాయకులను తయారు చేస్తున్న హార్వర్డ్ కెన్నెడీ స్కూల్, ఇంతటి వివాదాస్పద నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులకు సర్టిఫికెట్లు ఇచ్చే స్థాయికి ఎలా దిగజారింది? రేవంత్ రెడ్డికి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు కనీస నేపథ్య విచారణ, అధికారిక ఇంటర్వ్యూ లేదా తగిన శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించడం లేదు. హార్వర్డ్ కేవలం ప్రతిష్ఠ లేదా ఫీజుల కోసం వివాదాస్పద వ్యక్తులకు ఇలాంటి చిన్న ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లను 'అమ్ముకుంటోంది' అనిపిస్తోంది. ఇలా చేయడం ద్వారా అవినీతిపరులైన నాయకులు తమ నైతిక తప్పిదాలను, నేరాలను కప్పిపుచ్చుకుని, చట్టబద్ధత అనే ముసుగును ధరించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇది నాయకత్వం కాదు, నమ్మక ద్రోహం.
నేను చదువుకున్న సంస్థ, నిజాయితీ కంటే ప్రజాదరణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ స్థాయికి దిగజారినందుకు సిగ్గుపడుతున్నాను. దయచేసి ఈ సర్టిఫికెట్‌ను తక్షణమే రద్దు చేయండి. భవిష్యత్తులో ఇలాంటి తీవ్రమైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండేందుకు మీ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్ ప్రక్రియలను పునఃపరిశీలించండి. మీరు చర్యలు తీసుకోకపోతే, హార్వర్డ్ ప్రతిష్ఠ ఇప్పుడు అత్యధిక ధరకు లేదా అత్యంత అపఖ్యాతి పాలైన వారికి అమ్ముడుపోతోందని నిర్ధారణ అవుతుంది. హార్వర్డ్‌కు సిగ్గుచేటు!
మీ తక్షణ స్పందన, కచ్చితమైన చర్య కోసం నేను ఎదురుచూస్తున్నాను.
భవదీయుడు,
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
MC-MPA 2012
ఎడ్వర్డ్ ఎస్. మాసన్ ఫెలో