రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి ధర

  • లాభాల స్వీకరణ అనంతరం రెండు రోజులుగా పెరుగుతున్న ధరలు
  • రూ.1,64,400 పలుకుతున్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
  • రూ.2,93,900కు చేరుకున్న కిలో వెండి ధర
బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. వెండి కిలో ధర రూ.14 వేలు పెరగగా, బంగారం రూ.1.60 వేలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో విలువైన లోహాల ధరలు పెరుగుతున్నాయి. లాభాల స్వీకరణ సహా వివిధ కారణాలతో రెండు రోజుల క్రితం వరకు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం గం.11.30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,64,400 పలికింది. నిన్నటి రూ.1,58,500తో పోలిస్తే దాదాపు రూ.6 వేలు పెరిగింది. అలాగే నిన్న రూ.2,79,600 వద్ద ముగిసిన వెండి ఈరోజు రూ.14 వేలు పెరిగి రూ.2,93,900కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సు 5,080 డాలర్లు, వెండి 87.95 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.


More Telugu News

Gold Price Silver Price Hyderabad Bullion Market Wedding Season International Market Investment