అనంతలో దారుణం .. తల్లీకొడుకుల దారుణ హత్య
- శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఘటన
- నల్లప్ప రెండో భార్య యల్లమ్మ (38), ఆమె కుమారుడు చిన్నా (22) హత్యకు గురైన వైనం
- ఆస్తి వివాదాలే కారణమని భావిస్తున్న పోలీసులు
అనంతపురం జిల్లాలో తల్లీకొడుకుల దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. తరిమెల గ్రామానికి చెందిన నల్లప్పకు ఇద్దరు భార్యలు ఉండగా, ఆయన మృతి అనంతరం ఆస్తి పంపకాల విషయంలో మొదటి భార్య పిల్లలకు, రెండో భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న నల్లప్ప రెండో భార్య యల్లమ్మ (38), ఆమె కుమారుడు చిన్నా (22) హత్యకు గురయ్యారు. మొదటి భార్యకు చెందిన కుమారులే ఈ హత్యలకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూమి సహా ఆస్తుల పంపిణీపై తలెత్తిన ఘర్షణలే ఈ జంట హత్యలకు కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు తరిమెల గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసు భద్రతను పెంచారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని అనంతపురం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.