: యూపీ అసెంబ్లీలో ‘కర్ణాటక స్పీకర్ సింహాసనం’
- కర్ణాటక సభలో కుర్చీని చూసి మనసుపడ్డ యూపీ స్పీకర్
- స్వల్ప మార్పులతో సేమ్ కుర్చీని తయారు చేసిచ్చిన కళాకారుడు
- కుర్చీ కోసం సుమారు 30 లక్షల ఖర్చు చేసిన యూపీ ప్రభుత్వం
కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ కుర్చీని చూసి మనసుపడ్డ ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీశ్ మహానా దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేసి అలాంటి కుర్చీనే తయారుచేయించుకున్నారు. సతీశ్ మహానా కోరిక మేరకు కర్ణాటక స్పీకర్ ఖాదర్.. తన కుర్చీని పోలిన కుర్చీ తయారీకి కళాకారులను పురమాయించారు. పదిమంది కళాకారులు దాదాపు 2 నెలల పాటు శ్రమించి ఈ కుర్చీని తయారు చేశారు. ఇప్పటికే ఈ కుర్చీని ఉత్తర్ప్రదేశ్ కు పంపించినట్లు.. ఆ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ఫిబ్రవరి 5 నాటికి అక్కడికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఇటు కర్ణాటకలో, అటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలలో ఒకే తరహా కుర్చీలు ఉండనున్నాయి. వివరాల్లోకి వెళితే..
గతేడాది కర్ణాటకలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు కోసం ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీశ్ మహానా బెంగళూరుకు వచ్చారు. ఆ సమయంలో సభలో స్పీకర్ కుర్చీ ఆయనను బాగా ఆకట్టుకుంది. ఆ కుర్చీని తయారుచేసిన కళాకారుడి గురించి ఖాదర్ ను ఆరా తీశారు. యూపీ సభలోనూ ఇలాంటి కుర్చీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో మైసూరుకు చెందిన కళాకారులను ఖాదర్ ఆయనకు పరిచయం చేశారు. ఆ తర్వాత చిన్న డిజైన్ మార్పులతో కర్ణాటక కుర్చీ నమూనా ఆధారంగానే కొత్త కుర్చీ తయారీకి ఏర్పాట్లు జరిగాయి.
కుర్చీ ప్రత్యేకతలు ఇవే..
రోజ్వుడ్తో తయారు చేసిన ఈ కుర్చీ.. 7.5 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉంటుంది. కుర్చీపైన గొడుగు లాంటి ఆకారం ఉంది. ఆర్మ్రెస్ట్ భాగంలో సింహం, ఏనుగు బొమ్మలు కళాత్మకంగా చెక్కారు. దానిపైన ఉత్తరప్రదేశ్ రాజముద్ర ఏర్పాటు చేశారు. సీటు భాగాన్ని లెదర్తో చేసినట్లు కళాకారుడు కైజర్ అలీ ఖాన్ తెలిపారు.