Jyothi: ప్రేమించి పెళ్లాడి.. తల్లిదండ్రులతో కలిసి చంపేసింది!

Jyothi arrested for murdering husband Jitendra after love marriage
  • ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దారుణ హత్య
  • రెండు నెలలకే ముగిసిన 9 ఏళ్ల బంధం
  •  ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డ్రామా
  •  నిందితురాలు జ్యోతి అరెస్ట్
తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఓ యువతి తన భర్తను తన కుటుంబ సభ్యులతో కలిసి అత్యంత క్రూరంగా అంతం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిందీ ఘటన.

జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగి కాగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్‌గా పనిచేస్తోంది. ఆన్‌లైన్ జూదం వీరిమధ్య చిచ్చు రాజేసింది. జితేంద్ర తన భార్య బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 20,000 డ్రా చేసి ఆన్‌లైన్ గేమింగ్‌లో పోగొట్టాడు. ఈ విషయంపై జనవరి 26న ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

కోపంతో ఊగిపోయిన జ్యోతి తన తల్లిదండ్రులు, సోదరుడిని ఇంటికి పిలిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతి తండ్రి కాళీచరణ్, తల్లి చమేలీ, సోదరుడు దీపక్ కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా అదిమిపట్టారు. అదే సమయంలో జ్యోతి తన భర్త గొంతు నులిమి చంపేసింది.

హత్య తర్వాత మృతదేహాన్ని మఫ్లర్‌తో కిటికీ గ్రిల్‌కు వేలాడదీశారు. జితేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడంటూ చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, జితేంద్ర సోదరుడి అనుమానంతో పోలీసులు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో అసలు నిజం బయటపడింది. అది ఆత్మహత్య కాదు, గొంతు నులమడం వల్ల జరిగిన హత్యని తేలింది.

నిందితురాలు జ్యోతి పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం గాలిస్తున్నారు.
Jyothi
Jyothi murder case
Jitendra Kumar Yadav
love marriage murder
property dispute murder
Bareilly crime news
family murder
IVRI employee murder
arranged murder plot
crime news Andhra Pradesh

More Telugu News