స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇవ్వడం ఆయన నిజాయతీకి నిదర్శనం: అచ్చెన్నాయుడు
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్ ఇచ్చిందన్న అచ్చెన్నాయుడు
- సత్యమే గెలిచిందని, నిజాయతీ నిలబడిందని వ్యాఖ్యలు
- గత ప్రభుత్వ కక్షపూరిత కుట్రలు విఫలమయ్యాయని వెల్లడి
- రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళతామని స్పష్టీకరణ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్‌చిట్ ఇవ్వడం ఆయన నిజాయతీకి నిదర్శనమన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సత్యమే గెలిచిందని, నిజాయతీ నిలబడిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిష్కళంకమైన రాజకీయ జీవితానికి ఇది ఒక గొప్ప విజయమని అభివర్ణించారు. న్యాయం, ధర్మం వైపు నిలబడే నాయకుడు చంద్రబాబు అని ఈ పరిణామంతో మరోసారి స్పష్టమైందని తెలిపారు. ఈ కేసులో ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదని ఈడీ తేల్చిచెప్పడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరించి, ఎన్ని కుట్రలు చేసినా ఆయన చట్టాన్ని గౌరవిస్తూ ధైర్యంగా నిలబడ్డారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే గొప్ప ఆలోచనతో చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ పథకాన్ని ప్రారంభిస్తే, దాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెచ్చిన ఒక మంచి పథకంపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసును ఉపసంహరించుకోవడం, చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి గట్టి చెంపపెట్టు లాంటిదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అటు ఏపీ సీఐడీ, ఇటు ఈడీ.. రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేయడం ఆయన పరిపాలనా దక్షతకు, నిబద్ధతకు నిదర్శనమని వివరించారు. ఎన్ని వ్యక్తిగత దూషణలకు దిగినా, కుట్రలు పన్నినా అంతిమంగా సత్యమే విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరూపించారని అన్నారు. రాష్ట్రాభివృద్ధే ఏకైక లక్ష్యంగా ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.