నందినగర్ నివాసానికి కేసీఆర్.. వీడియో ఇదిగో!
- నందినగర్ లో మాజీ సీఎంను విచారించనున్న సిట్ అధికారులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ
- మాజీ సీఎం నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు విచారించనున్న విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. నందినగర్ లోని ఆయన నివాసంలో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్.. మరికాసేపట్లో నందినగర్ లోని తన నివాసానికి చేరుకోనున్నారు. సిట్ విచారణకు సహకరిస్తానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు, విచారణను జీర్ణించుకోలేని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నందినగర్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందినగర్ లోని కేసీఆర్ నివాసం చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరిక
కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని కమిషనర్లు, ఎస్పీలను ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరించారు. ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులపై వేగంగా స్పందించాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
నందినగర్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, ఎన్‌టీఆర్ భవన్, రోడ్ నెంబర్-12 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాలను నిలిపివేయడం లేదా మళ్లించడం చేయనున్నట్లు వివరించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని సూచించారు.