కేంద్ర బడ్జెట్: జిల్లాకో గర్ల్స్ హాస్టల్



బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రాధాన్యమిచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాలికల వసతి గృహాలపై కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

అదేవిధంగా, సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం, మూడు ఆయుర్వేద ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ఆతిథ్యరంగంలో జాతీయ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు, 20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల గైడ్‌లను నియమించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


More Telugu News