బడ్జెట్ 2026: కాంజీవరం చీరలో నిర్మలమ్మ



కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ను మరికొద్ది సేపట్లో లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ వార్షిక బడ్జెట్ ను లోక్ సభలో చదివి వినిపించనున్నారు. బడ్జెట్ సందర్భంగా నిర్మలమ్మ కాంజీవరం చీరను ధరించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి ఈ చీర ధరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంజీవరం, టస్సర్, లేదా ఇతర ప్రాంతీయ చేనేత కళలను ప్రదర్శిస్తూ, భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా ఉండే చీరలనే బడ్జెట్ వేళ ధరించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంచుకుంటారు. కాగా, ఈ ఏడాది కాంజీవరం పర్పుల్ కాటన్ సిల్క్ చీర ధరించిన మంత్రి నిర్మలా సీతారామన్.. 2024లో బీహార్ సాంప్రదాయాన్ని తెలిపే మధుబని ప్రింట్‌తో కూడిన ఆఫ్-వైట్ హ్యాండ్లూమ్ చీర ధరించారు.

అదే ఏడాది మధ్యంతర బడ్జెట్ కు నీలి రంగు టస్సర్ సిల్క్ చీరపై కాంత వర్క్ చేసిన చీరను.. 2023లో ఎరుపు-నలుపు రంగుల కాసుతి ఎంబ్రాయిడరీ చీరను నిర్మలమ్మ ధరించారు.


More Telugu News